3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు. అంటే మొత్తం 8 మ్యాచ్‌లు గెలవాలనే ఉద్దేశ్యంతో టీమిండియా దక్షిణాఫ్రికాకు బయల్దేరిందన్నమాట. బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి భారత జట్టు దక్షిణాఫ్రికా బయల్దేరింది. ప్రపంచకప్ తర్వాత ఈ తొలి విదేశీ పర్యటనపై భారత జట్టు మేనేజ్‌మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. దీనికి కారణం ఈ టూర్‌లో తమ అదష్టాన్ని చెక్ చేసుకునే సువర్ణావకాశాన్ని పొందిన కొత్త ఆటగాళ్లు జట్టులో చేరడమే. దక్షిణాఫ్రికా గడ్డపై తన సత్తాను నిరూపించుకుంటే.. టీమ్‌ఇండియాలో స్థానం సుస్థిరం అవుతుందన్నమాట. దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టీ20, వన్డే, టెస్టు జట్లను ఏకకాలంలో ప్రకటించారు. ఈ పర్యటనలో జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్లు కూడా భిన్నంగా ఉంటారు. టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మూడు జట్లు కలిసి దక్షిణాఫ్రికాకు విమానంలో బయల్దేరారు. భారత జట్టు దక్షిణాఫ్రికాకు బయల్దేరిన వీడియోలు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ ఫొటోలను టీమిండియా ఆటగాళ్లు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి షేర్ చేశారు. ఓ ఫొటోలో రింకూ సింగ్, కుల్దీప్, అర్ష్‌దీప్ వంటి కొంతమంది ఆటగాళ్ళు నిలబడి ఉన్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆటగాళ్లందరూ భారత జట్టులో భాగమే. డిసెంబర్ 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్ తన మొత్తం 8 మ్యాచ్‌లను 10 డిసెంబర్ 2023 నుంచి 7 జనవరి 2024 వరకు ఆడాల్సి ఉంది. ఈ టూర్ టీ20 సిరీస్‌తో ప్రారంభం కాగా, టెస్టు సిరీస్‌తో ముగుస్తుంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా భారత జట్టుకు చరిత్ర సష్టించే సువర్ణావకాశం లభించనుంది. ఎందుకంటే, దక్షిణాఫ్రికాలో ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం అవుతుంది. అయితే, దీని కోసం, టీమ్ ఇండియా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పర్యటన ప్రారంభమైన 96 గంటల్లో సాధించాల్సి ఉంటుంది. అంటే 3 టీ20ల సిరీస్ జరిగే 96 గంటలన్నమాట. అంటే డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 14వ తేదీలోపు టీమిండియా విజయ పతాకాన్ని ఎగురవేయాల్సి ఉంటుంది.
తెలంగాణ మంత్రుల జాబితా విడుదల
వెక్కి వెక్కి ఏడ్చిన ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ వీడియో వైరల్