తెలంగాణ ఓటర్లు ఆసక్తి ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను సోమవారం మధ్యాహ్న 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ గడువు ముగింపు తేది నవంబర్ 10 వరకు ఉండనుంది. నామినేషన్ల పరిశీలన 13 నవంబర్, అభ్యర్థలు ఉపసంహరణ గడువు 15 నవంబర్ కాగా నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల లెక్కింపు ఉండనున్నట్టు షెడ్యూల్ పేర్కొన్నది.
మొత్తం తెలంగాణాలో అసెంబ్లీ స్థానాలు 119
ఎస్సీ రిజర్వ్‌డ్ 19
ఎస్టీ రిజర్వ్ 12
మొత్తం ఓటర్లు 3,17,32,727
పురుషులు 1,58,71,493
స్త్రీలు 1,58,43,339,
పోలింగ్ కేంద్రాలు 35,356