TG RTC” ప్రసిద్ధ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం కార్తీక మాసంలో స్పెషల్ బస్సులను ఏర్పాట్లు చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. కీసరగుట్ట, వేములవాడ,శ్రీశైలం, ధర్మపురి, లాంటి పలు దేవాలయాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ఆదివారం, సోమవారాల్లో శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని వివరించారు. దానికనుగుణంగా స్పెషల్ బస్సులను అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఆర్టీసీ సంస్థ పనితీరు, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మీ పథకం, కార్తీకమాసం ఛాలెంజ్ లాంటి పలు అంశాలపై హైదరాబాద్‌లోని బస్‌భవన్ నుంచి ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ సంస్థకు శబరిమల
ఆపరేషన్స్, కార్తీక మాసం చాలా కీలకమన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు దిశానిర్దేశంచేశారు. నవంబర్ నెల 15న కార్తీక పౌర్ణమి నాడు తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంకు వెళ్లే భక్తులకు స్పెషల్ ప్యాకేజీ అందిస్తున్నట్టు సజ్జనార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలకు ప్రతి సోమవారంనాడు స్పెషల్ బస్సులను నడుపుతున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Floor Cleaning Mop” ఫ్లోర్ క్లీనింగ్ సెల్ఫ్ రింగింగ్ మాప్.. 695 రూపాయలకే
Viral Video” బస్సు ఢీ కొట్టింది.. అయినా లేచి పబ్ కు వెళ్లాడు.. వీడియో వైరల్
Ceiling Duster” లాంగ్ హ్యాండిల్ సీలింగ్ డస్టర్.. కేవలం 299 రూపాయలే..
Onion bombs” పేలిన ఉల్లిగడ్డ బాంబులు.. ముక్కలైన వ్యక్తి.. వీడియో వైరల్
Pad And Tabs” బ్రాండెడ్ ట్యాబ్, ఐప్యాడ్‌లపై భారీ తగ్గింపు.. హానర్ ట్యాబ్ కేవలం రూ. 9,999 కే