Satara” ప్రేమ విఫలమైందని కోపంతో… బాలిక మెడకు కత్తి పెట్టి బెదిరింపు.. స్థానికులు ఏం చేశారంటే

Satara”  సతారా (మహారాష్ట్ర): సోమవారం మధ్యాహ్నం సతారా నగరంలో ఓ 18 ఏళ్ల యువకుడు స్థానికంగా నివసించే 10వ తరగతి విద్యార్థిని మెడ‌పై కత్తి పెట్టి భయపెట్టిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఓ నివాస ప్రాంతంలో పగటి పూటనే చోటు చేసుకుంది. అప్రమత్త‌మైన స్థానికులు, పోలీసుల చొరవతో బాలికను సురక్షితంగా రక్షించగలిగారు.

ప్రేమ విఫలమై… కత్తితో బెదిరింపు
సోమ‌వారం సాయంత్రం 4 గంటల సమయంలో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న బాలికపై యువకుడు దాడికి పాల్పడ్డాడు. ప్రాథమిక సమాచారం మేరకు, ఆ యువకుడు బాలికతో ఒకే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ప్రేమను తిరస్కరించిందన్న మనస్థాపంతో మెడకు కత్తితో పెట్టి బెదిరించాడు.

ఈ దృశ్యం అక్కడే ఉన్న ఓ వ్యక్తి మొబైల్‌లో రికార్డ్ చేయగా, ఇంకొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు నగర పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం కానిస్టేబుళ్లు సాగర్ నికమ్, ధీరజ్ మోర్ లు వెంటనే అక్కడకు చేరుకున్నారు.

అప్రతిహత ధైర్యంతో బాలికను రక్షించిన పోలీసులు
సుమారు 10 నిమిషాలపాటు పోలీసులు, స్థానికులు అతన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ యువకుడు కత్తి వదిలే పరిస్థితిలో లేకపోయాడు. చివరికి, ఒక కానిస్టేబుల్ ముందుండి అతనితో మాట్లాడుతూ.. దృష్టి మళ్లించగా, ఇంకొకరు వెనుక నుంచి నిశ్శబ్దంగా వెళ్లి అతని చేతిని పట్టుకున్నారు. వెంటనే బాలికను అక్కడి నుంచి తొలగించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

బాలిక రక్షితంగా బయటపడిన తర్వాత యువకుడిపై స్థానికుల ఆగ్రహం
బాలికను కాపాడిన తర్వాత, అక్కడికే చేరుకున్న జనాలు ఆ యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు. చివరికి యువకుడిని గుంపు నుంచి బయటపడేసి షహూపురి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *