సంక్రాంతికి ఆరు రోజులు సెల‌వులు..

తెలంగాణ సర్కార్‌ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని వెల్లడించింది. సంక్రాంతి సెలువులు జనవరి 12న తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.. మరుసటి రోజు రెండో శనివారం, తర్వాత 14 ఆదివారం భోగి పండుగ కాగా.. 15వ తేదీ సోమవారం సంక్రాంతి పర్వదిన వస్తోంది. ఇక, 16వ తేదీన కనుమ పండగ ఉంది.. కాగా, 17వ తేదీన ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్‌ వస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్‌ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది.

ఇచ్చింది ఆరు హామీలు కాదు… 420 హామీలు.. బీఆర్ ఎస్ బుక్లెట్

కాగా జనవరి 25న ఆదివారం, 26 రిపబ్లిక్‌ డే వరుస సెలవులు కూడా రాబోతున్నాయి. ఇక, ఇంటర్మీడియట్‌ బోర్డు సైతం సంక్రాంతి పండగకు సంబంధిచి సెలవులను ప్రకటించింది. జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉంటాయని తెలిపింది. కేవలం నాలుగు రోజులు మాత్రమే పండగకు సెలవులు మంజూరు చేసింది. ఇందులో 13వ తేదీ రెండో శనివారం కాగా, 14న భోగి, 15న మకర సంక్రాంతి పండగా ఉండగా, 16వ తేదీన కనుమ పండగను జరుపుకోనున్నారు.. ఇక, 17వ తేదీ నుంచి విద్యార్థులు తిరిగి కాలేజీలకు రావాల్సిందేనని ఇంటర్మీడియట్‌ బోర్డు చెప్పింది.

 

26 మంది ఐఎఎస్‌ల బ‌దిలీ

ఇచ్చింది ఆరు హామీలు కాదు… 420 హామీలు.. బీఆర్ ఎస్ బుక్లెట్

ఏడేళ్ల జర్నీలో అన్నీ విజయాలే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *