Sunday , 15 December 2024
Breaking News

తెలంగాణా… చేజిక్కేనా..? ప్ర‌చారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్

తెలంగాణాలో అధికారంలోకి రావ‌డానికి కాంగ్రెస్ శాయ‌శ‌క్తులు ఒడ్డుతోంది. హైక‌మాండ్ కూడా ప్ర‌త్యేక దృష్టి సారించింది. సోనియా గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. క‌ర్ణాట‌క‌లో మాదిరిగా ఇక్క‌డా అధికారం చే..జిక్కుంచుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ అగ్ర నాయ‌కురాలు సోనియా గాంధీతో బహిరంగ స‌భ కూడా ఏర్పాటు చేశారు. ఆ స‌భ‌లో ఆరు గ్యారంటీ స్కీములు కూడా ప్ర‌క‌టించారు. చాన్స్ దొరికితే అధికార బీఆర్ ఎస్‌ను కార్న‌ర్ చేస్తున్నారు. ఈ సారి ఎన్నిక‌ల్లో గెలువ‌కుంటే తెలంగాణాలో కాంగ్రెస్ చరిత్ర ముగిసిన‌ట్టేన‌ని మేధావులు భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొంత‌మంది బీఆర్ఎస్ లో చేరారు. ఈ సారి ఆ ప‌రిస్థితి రాకుండా గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్పుడు తప్పకుండా గెలిచి పార్టీ మారిన వారికి గుణ‌పాఠం నేర్పాల‌ని చూస్తున్నారు. ఈ సారి తెలంగాణాలో గెలుస్తామ‌న్న ధీమాలో కాంగ్రెస్ రాహుల్ కూడా ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. సోనియా గాంధీ ప్ర‌క‌టించిన ఆరు ప్ర‌ధాన స్కీముల‌ను విస్తృతంగా ప్ర‌చారంలోకి తీసుకెళ్ల‌నున్నారు. బయ‌ట‌ప‌డ‌కున్నా లోప‌ల‌లో అంత‌ర్గ‌తంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. బీసీల‌కు కూడా స‌ముచిత స్థానం క‌ల్పించాల‌ని అందులోని కొంత మంది బ‌లంగా వినిపిస్తున్నారు. వెర‌సి క‌లిసి ముందుకు పోవాల‌న్న సంక‌ల్పాన్ని కొంత వెనులాగుతోంది. వీటిన్నింటి అధిగ‌మిస్తూ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ల‌క్ష్యంగా పార్టీ వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. కీల‌క ప్ర‌క‌ట‌న‌లు, ఇత‌ర పార్టీల పెద్ద లీడ‌ర్ల చేర‌క‌ల కార్యక్ర‌మాల‌ను భారీ ఎత్తున చేప‌డుతున్నారు. ఇటీవ‌ల సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మల్లికార్జున్‌ఖ‌ర్గేల‌తో తెలంగాణాలో భారీ బ‌హిరంగా స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌తో పార్టీలో మ‌రింత జోష్ పెంచింది. అభ్య‌ర్థుల ఎంపిక కూడా గెలుపులో క్రీయాశీలకం కానుంది. ఇప్ప‌టికే ఆశావ‌హుల నుంచి అప్లికేష‌న్లు స్వీక‌రించారు. అతి తొంద‌ర్లోనే తొలిజాబితా ప్ర‌క‌టించొచ్చ‌ని స‌మాచారం.
ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్న‌రు. మ‌రో వైపు బీఆర్ఎస్ లీడ‌ర్లు, కేసీఆర్ అవినీతి కార్య‌క్ర‌మాల‌పూ ఫోక‌స్ చేయ‌నున్నారు. మిషన్‌ భగీరథ, కాళేశ్వరం, ధరణి వంటి వాటిలో అవినీతిపై దృష్టి సారించ‌నున్నారు. ఓటర్లకు చేరువయ్యేలా వినూత్నంగా ప్రచార అస్త్రాల‌ను త‌యారు చేస్తున్నారు. యువ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు సోష‌ల్ మీడియాను ఆక‌ట్టుకుంటున్నారు. ఎప్ప‌టిక‌ప్ప‌డు ఇమేజ్లు వీడియోల‌తో యువ‌త‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఎక్కువ‌గా కాళేశ్వరం, కోల్‌ స్కామ్‌, పేపర్‌ లీక్‌ స్కామ్‌, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌, జీవో 111 స్కామ్‌, ధరణి పోర్టల్‌ స్కామ్‌, ఓఆర్‌ఆర్‌ స్కామ్‌ అని పేర్లను జోడించింది. ఈ స్కాములన్నీ మన కుటుంబాన్ని ఒక్కటి చేయాలని పిలుపునిచ్చింది. చెరువుల‌ను బాగు చేసేందుకు చేప‌ట్టిన మిష‌న్ కాక‌తీయ‌ను కమీష‌న్ కాక‌తీయ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. కాంట్రాక్టర్లు చెరువులు తవ్వితే.. కేసీఆర్‌ కమిషన్లు తోడాడు అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 30శాతం కవిూషన్ అంటూ వాల్ పోస్ట‌ర్లు వేయిస్తున్నారు.
మ‌రో వైపు కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే తామూ చేసే ప‌నులు, హామీల అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. అందుకు త‌మ వ‌ద్ద కార్య‌చ‌ర‌ణ ఉంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించారు. తెలంగాణాలోని అన్ని అసెంబ్లీ స్థానాల‌కు ధీటైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపాల‌ని భావిస్తోంది. అన్ని స్థానాల్లో ఒకేసారి అభ్య‌ర్థుల‌ను దింపి దూసుకెళ్లాల‌ని భావిస్తున్నారు.

 

About Dc Telugu

Check Also

15.12.2024 Dc. Telugu Cinema

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంద‌ని సుడా చైర్మెన్ కోమ‌టిరెడ్డి న‌రేంద‌ర్ రెడ్డి …

HONOR 5G Phones

HONOR 5G Phones” హాన‌ర్ స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు.. 16 వ తేది వ‌ర‌కే త‌గ్గింపు

HONOR 5G Phones”  మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాల‌నుకుంటున్నారా.. అయితే హాన‌ర్ ఫోన్ల‌ను ఒక‌సారి ప‌రిశీలించండి. అతి త‌క్కువ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com