Two Guarantee” కాంగ్రెస్ ఎన్నికల్లో హావిూ ఇచ్చిన మేరకు మరో రెండు గ్యారెంటీలకు సర్కారు శ్రీకారం చుట్టింది. మాటిస్తే కాంగ్రెస్ వెనకడుగు వేయబోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక సోనియాగాంధీ మాటిస్తే అది శిలాశాసనమని తెలిపారు. సచివాలయంలో మంగళవారం 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ (Two Guarantee) పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం హావిూలు అమలు చేస్తున్నామని వివరించారు. పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్నామని స్పష్టం చేశారు. చేవెళ్లలో లక్షమంది మహిళల ముందు రెండు గ్యారంటీలను ప్రారంభించాలను కున్నాం కానీ ..మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ వల్ల చేవేళ్లలో ప్రారంభించలేక పోయామని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే సెక్రటేరియట్ లో రెండు గ్యారంటీలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. పేదలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ దేనన్నారు. ఆనాడు దీపం పథకం కింద మహిళలకు రూ. 400 లకే కాంగ్రెస్ గ్యాస్ (Two Guarantee) సిలిండర్ ఇచ్చినట్టు గుర్తు చేశారు. బీజేపీ వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 లకు పెరిగిందని విమర్శించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. వందకు వంద శాతం(Two Guarantee) గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
సచివాలయంలో మరో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula, మంత్రులు.#PrajaPrabhutvam pic.twitter.com/jYjuhLXIyH
— Telangana CMO (@TelanganaCMO) February 27, 2024
Viral Video” బీజీ రోడ్లపై దున్నపోతుమీద సవారీ.. హెల్మెట్ పెట్టుకుని మరీ..
Tspsc Group 1″ జూన్ 9 న గ్రూప్ 1ప్రిలిమినరీ పరీక్ష
Dwaraka City” నీటిలో ఉన్న ద్వారకాకు వెళ్లిన పీఎం మోడీ