Tsrtc News” ఆర్టీసీ మ‌రో గుడ్ న్యూస్.. రాముల‌వారి త‌లంబ్రాల బుకింగ్ గ‌డువు పొడ‌గింపు

Tsrtc News"

Tsrtc News”  ప్ర‌యాణికుల‌కు చేరువ‌వ‌డంలో టీఎస్ ఆర్టీసీ ఎన్నోప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప‌లు దేవాల‌యాల నుంచి ప్ర‌సాదాలు, త‌లంబ్రాల వంటివి భక్తుల‌కు అంద‌జేసేందుకు ప్ర‌త్యేక కృషి చేస్తోంది. అదే కోవలో శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును TSRTC పొడిగించింది. ఈ నెల (ఏప్రిల్‌) 25 తేదీ వరకు బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. రూ.151లకే విశిష్టమైన Tsrtc News”  రాములోరి కల్యాణ తలంబ్రాలు పొందే సదావకాశాన్ని వినియోగించుకోవాలని భక్తులను సంస్థ కోరింది.. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ వెబ్సైట్ http://tsrtclogistics.in ను సందర్శించి తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చ‌ని ఎక్స్‌లో పేర్కొంది. ఆఫ్ లైన్ లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించగలర‌ని సూచించింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Odisha Boat Accident” 57 మంది ఉన్న బోటు బోల్తా…

Rain Disaster” అకాల వ‌ర్షం… త‌డిసిన ధాన్యం

CM Revanth reddy” కేటిఆర్ మీ కారును పాత ఇనుముకు అమ్ముకోవలసిందే ః సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *