Wednesday , 26 June 2024
Breaking News
Medaram jatara

Medaram sammakka” ప‌చ్చ‌ని అడ‌వి ప‌ర‌వ‌శించి ఆడే..

  •  నేడు వనంలోకి..మళ్లా రెండేండ్లకు..
  • తెలంగాణాతో పాటు చత్తీస్‌ఘడ్‌,
    మహారాష్ట్ర, ఒడిస్సా భక్తులతో పులకించే కంకవనం.
  •  చెట్టు చేమలే ఊగి ఆడే ఈ మట్టిని ముద్దాడి..
  •  చీమల పుట్టనుంచి బయటకొచ్చినట్టు..మేడారం వైపు సాగిన జనం
  •  వెయ్యేండ్ల చరితగల మేడారం..
  • 1940లో మొదటి సారిగుర్తించిన నిజాం సర్కారు.
  • 1996 నుంచి రాష్ట్ర పండుగగా..

Medaram jatara”  సమ్మక్క ఓ భావోద్వేగం.. నిత్యం పూజలందుకునే తల్లులు కాదు.. రెండేండ్లకొసారి నాలుగు రోజుల పాటు కొలిచే కల్పవల్లుల వనదేవతలు.. జాతి జనుల కష్టం తీర్చేందుకు ప్రాణాలొదిలిన వీరగాథ. ముగ్గురు పిల్లలగన్న మూలపుటమ్మ సమ్మక్క.. కన్నెపల్లి జనుల కన్నీళ్లు తుడిచేందుకు భర్త పగిడిద్దరాజు, బిడ్డ సారలమ్మ, కొడుకు జంపన్నతో కధనరంగమందు కదిలిన పోరు దివిటిలు.. పచ్చని అడవిలో విచ్చు కత్తులై దూసుకెళ్లినా దక్కని విజయం. కండ్లముందే కుప్పకూలేను భర్త, అవమాన భారంతో వాగులో దూకేను కొడుకు, మృత్యుఒడిన బిడ్డ సారలమ్మ, తట్టుకోలేక చిలుకలగుట్టవైపు వెళ్లిన సమ్మక్క.. కంకపొదల్లో కుంకుమ భరణి రూపంలో వెలిసిన వనదేవత.. నాటి నుంచి రెండేండ్ల కొకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు మహదండి వేడుక ఈ మేడారం. జాతర సిన్ని మేడారం సిగాలు ఊగుతుండగా సిన్నా పెద్ద తేడా లేకుండా సిందులేసి ఆడే ఈ నాలుగు రోజులు లోకమంతా.. హక్కులకోసం అసువులు బాసిన తల్లులను స్మరిస్తూ సాగే ఈ వేడుకలో బెల్లం బుట్టలనే బంగారంగా (ప్రసాదంగా) పంచిపెడతూ సాగగా.. కల్లు శాకలే నైవేద్యంగా ఫరడవిల్లేను భక్తజనం. కుంకుమభరుణులై వెలిగే గిరిజన జ్యోతులను కష్టాలు తొలగించమని వేడుక. తెలంగాణాతో పాటు, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భక్తులు చీమల పుట్టనుంచి బయటకొచ్చినట్టు జనం మేడారం వైపు కదిలేను. పంచభూతాలే పరవశించి ఆడుతాయి ఈ వేడుక చూసి.. చెట్టుచేమలు మట్టిని ముద్దాడి ఊగి ఆడుతాయి.. నిత్యం పూజలందుకోకపోయినా.. గుడిగోపురం లేకున్నా భక్తులకు ఉన్నదల్లా ఒకటే నమ్మకం. ఈ జాతరను 1940లో మొదటి సారి గుర్తించిన నిజార సర్కారు. అప్పుడు 15 వేల జనం రాక… అప్పటి జనాభాలో అది చాలా ఎక్కువ. 1996లో రాష్ట్ర పండుగగా గుర్తింపు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

BRS Mla lasya Nandita” మొన్న ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డి… నేడు మ‌రో ప్ర‌మాదంలో మృతి

Ts Rtc Bus” సీట్ల‌పై నుంచి న‌డిచి టిక్కెట్టు.. వీడియో పోస్టు

Ts Rtc Bus” సీట్ల‌పై నుంచి న‌డిచి టిక్కెట్టు.. వీడియో పోస్టు

About Dc Telugu

Check Also

Viral video

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Viral video” ఈ మ‌ధ్య యువ‌త రీల్స్ కోసం ఎంత‌టి సాహసాలకైనా వెనుకాడ‌డం లేదు. మొన్న పూణేలోని ఓ ఎత్త‌యిన …

Video viral

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Video viral” రీల్స్ చేయ‌డం… ఫేమ‌స్ అవ‌డం.. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌.. సాధార‌ణంగా కొన్ని ప‌నులు చేయ‌డానికి కొంత …

tribal women

tribal women” ఆదివాసి మ‌హిళ‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆర్థిక సాయం ప్ర‌కటించిన మంత్రి జూప‌ల్లి

tribal women” నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ‌లం మొలచింత‌లప‌ల్లి ఆదివాసీ మ‌హిళ‌పై దారుణంగా దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com