మాజీ ఎంపీ విజయశాంతి ఈ పేరుకంటే ఎక్కువగా రాములమ్మగానే సుపరిచుతురాలు.. ఈ మధ్యనే బీజేపీకి రాజీనామా చేసిన ఈమె తాజాగా శుక్రవారం (నవంబర్ 17) కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కంప్పుకున్నారు. అయితే గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన ఆమె వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ అదే స్థానం హామితో నే కాంగ్రెస్ లో చేరినట్టు సమాచారం. బీజేపీలో ఉన్న ఆమె కొంతకాలంగా ఆ పార్టీలో అసంతృప్తిగా ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్‌కు ముందు రాజగోపాల్‌రెడ్డి, వివేక్ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. దీంతో అప్పటి నుంచే రాములమ్మ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలొచ్చాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆమె స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం సాగించారు. ప్రస్తుతం తెలంగాణాలో మరో 15 రోజుల్లో అసెంబ్లీ జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ విజయ శాంతికి ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి. ఈరోజే ఏఐసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. విజయ శాంతి రాహుల్ సమక్షంలో చేరుతారని అందరూ అనుకున్నారని కానీ మల్లిఖార్జునఖర్గే సమక్షంలో చేరిపోయారు. తర్వాత మళ్లీ రాహుల్ గాంధీ ని కలిసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
రెంటు బరువు తగ్గించుకుందామనుకున్నడు.. కేసుల పాలయ్యాడు..
రోహిత్ శర్మ చీటింగ్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్
తండ్రి మరణం.. భార్య విడాకులు.. తలొగ్గలేదు.. మ్యాచ్‌ను మలుపు తిప్పి షమీ