Wednesday , 26 June 2024
Breaking News

రెంటు బ‌రువు త‌గ్గించుకుందామ‌నుకున్న‌డు.. కేసుల పాల‌య్యాడు..

అత‌నో సాప్ట్‌వేర్ ఉద్యోగి హైద‌రాబాద్‌లో ఓ రూం తీసుకుని ఉద్యోగం చేసుకుంటున్న‌డు ఈ క్ర‌మంలో రెంటు ఎక్కువైపోతుంద‌ని రూం షేరింగ్ కు యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్ చూసిన మ‌హిళ రూంలో ఉండ‌డానికి వ‌చ్చింది. ఆ యువ‌కుడు స‌రేన‌ని యువ‌తిని రూమేట్గా ఉండ‌మ‌న్నాడు. కొద్ది రోజుల త‌రువాత యువ‌తి అత‌ని మ‌ధ్య స‌హ‌జ‌నం కూడా ఏర్ప‌డింది. కొంత కాలం త‌రువాత అసలు నిజం తెలిసి షాక్ గుర‌య్యాడు. రూం ఖాళీ చేయాల‌ని ఆమెకు సూచించాడు. అప్ప‌టి నుంచి కేసుల‌పాలై ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. అస‌లు ఏం జ‌రిగింది. అయితే ఈ స్టోరీ చ‌ద‌వండ.. హైద‌రాబాద్ న‌గ‌రంలోని వెంగ‌ళ్‌రావు న‌గ‌ర్‌లోని కృష్ణ‌న‌గ‌ర్‌లో పి. కిర‌ణ్ కుమార్ అనే యువ‌కుడు ఓ గ‌దిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఒక్క‌డే ఉండ‌డంతో రూం కిరాయి ఎక్కువ‌వ‌డంతో షేరింగ్ కోసం ఓ ఎల్ ఎక్స్‌లో ఒక యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్ ను చూసిన ఓ యువ‌తి తాను రూంలో షేరింగ్ చేసుకుంటూ ఉంటాన‌ని వ‌చ్చింది. కొంత కాలం త‌రువాత వారు కూక‌ట్‌ప‌ల్లికి వెళ్లి అక్క‌డ ఉంటున్నారు. వారి మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగి స‌హ‌జీవ‌నం కూడా చేశారు. ఆ త‌రువాత కొద్ది రోజుల‌కు తాను వేశ్య అని అత‌డికి చెప్పింది. దీంతో ఖంగు తిన్న అత‌డు వెంటనే రూం నుంచి వెళ్లిపోవాల‌ని చెప్పాడు. ఇందుకు ఆ యువ‌తి ఒప్పుకోలేదు. వారిద్ద‌రూ స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డింది. అంతే కాకుండా కిర‌ణ్ మీద లైంగిక దాడి కేసులు పెట్టింది. పోలీసులు ఇద్ద‌రికీ కౌన్సిలింగ్ చేసి పంపారు. ఆ త‌రువాత కూడా ఆ ఫొటోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్టు చేసింది. దీంతో కిర‌ణ్ సైబ‌ర్ క్రైం పోలీసుల వ‌ద్ద కు వెళ్లి త‌న గోడును వెళ్ల‌బోసుకున్న‌డు. త‌న మీద కంప్ల‌యింట్ చేసిండన్న‌ కోపంతో న‌వంబ‌ర్ 13 న ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో కిర‌ణ్‌పై దాడి చేయించింది. దాడి చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కిర‌ణ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

తండ్రి మ‌ర‌ణం.. భార్య విడాకులు.. త‌లొగ్గ‌లేదు.. మ్యాచ్‌ను మలుపు తిప్పి ష‌మీ

రోహిత్‌ శర్మ చీటింగ్‌ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ సికందర్ భ‌క్త్

మొన్న రష్మిక ..నేడు కాజల్ కాజోల్‌ డీఫేక్‌ వీడియోలు రెచ్చిపోతున్న కేటుగాళ్లు

మోడీ మ్యాజిక్ … రూపాయిబిల్ల‌.. చిన్న‌పిల్ల‌ల‌తో ఆట.. వీడియో మీరు చూడండి

About Dc Telugu

Check Also

Viral video

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Viral video” ఈ మ‌ధ్య యువ‌త రీల్స్ కోసం ఎంత‌టి సాహసాలకైనా వెనుకాడ‌డం లేదు. మొన్న పూణేలోని ఓ ఎత్త‌యిన …

Video viral

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Video viral” రీల్స్ చేయ‌డం… ఫేమ‌స్ అవ‌డం.. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌.. సాధార‌ణంగా కొన్ని ప‌నులు చేయ‌డానికి కొంత …

tribal women

tribal women” ఆదివాసి మ‌హిళ‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆర్థిక సాయం ప్ర‌కటించిన మంత్రి జూప‌ల్లి

tribal women” నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ‌లం మొలచింత‌లప‌ల్లి ఆదివాసీ మ‌హిళ‌పై దారుణంగా దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com