Voter list review” ఎంపీడీవో కృష్ణ ప్రసాద్..
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు మండల ప్రాదేశిక ఓటరు జాబితా పై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిషత్తు పరిధిలో 13 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు 13 ప్రాదేశిక నియోజకవర్గం ఓటరు జాబితాను తయారు చేసినట్టు తెలిపారు. ఈ ఓటరు జాబితాను నోటీస్ బోర్డ్ పై ప్రకటించి, ఎలాంటి అభ్యంతరాలు ఉన్న తెలియపరచాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఓటర్లను కోరడం జరిగిందని, ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి తుది జాబితా తయారు చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాలను సమీక్ష సమావేశంలో స్వీకరించడం జరిగిందని, రాజకీయ పార్టీల అభిప్రాయాలను సూచనలను ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, సిపిఎం పార్టీ కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
Hisense” హైసెన్స్ 43E6N స్మార్ట్ 4K గూగుల్ టీవీ – బడ్జెట్లో హైఎండ్ ఫీచర్లు!
Samsung Refrigerator” సామ్సంగ్ 419 లీటర్ల బెస్పోక్ AI ఫ్రిజ్ సమీక్ష
