పశ్చిమబెంగాల్ సీఎం పెట్టుబడులను తమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆమె ఫిట్‌నెస్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మాడ్రిడ్ లోని ఓ పార్క్‌లో జాగింగ్ చేశారు. జాగింగ్‌లో వింత ఏముదంటారా…? సాధరాణంగా జాగింగ్ షూ, ప్రత్యేక మైన డ్రెస్‌లతో చేస్తుంటారు. కానీ బెంగాల్ సీఎం చీరకట్టులో..చెప్పులు వేసుకుని జాగింగ్‌లో పాల్గొన్నారు. చేతికి స్మార్ట్ వాచ్ కూడా పెట్టుకున్నారు. జాగింగ్ కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పొద్దున జాగింగ్ చేస్తే శరీరానికి కావాల్సిన శక్తి వస్తుందని ట్యాగ్ చేశారు. ఫిట్ గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని రాసుకొచ్చారు.
https://www.instagram.com/p/CxLWeTmAsww/?utm_source=ig_web_copy_link