స్వచ్చ సర్వేక్షన్‌లో కరీంనగర్ పల్లెలు అవార్డుల పంట పండించాయి.. కరీంనగర్‌జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామాలకు అవార్డులు దక్కాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో గురవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయా గ్రామాల సర్పంచ్‌లకు అవార్డులు అందజేశారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలన, మురికి నీటి సక్రమ నిర్వహణలో భాగంగా వ్యక్తిగత ఇంకుడుగుంతల నిర్మాణం, కిచెన్ గార్డెన్ ల ఏర్పాటు, కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం వంటి నిర్వహణాలో పలుగ్రామాలను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి 2వేల జనాభాలోపు కేటగీరిలో గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామానికి రెండో స్థానం దక్కింది. 5వేల జనాభా లోపు కేటగిరీలో రామడుగు మండలంలోని వెలిచాల గ్రామానికి ఐదో స్థానంలో నిలిచింది. ఈ గ్రామాల అభివృద్ధికి ఒక్కొక్క గ్రామానికి రూ. 10,00,000 చొప్పున ప్రకటించారు. వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన, ఖాసింపేట సర్పంచ్ గంప మల్లీశ్వరి, పంచాయతీ కార్యదర్శులు అనిల్, ఆనంద్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, పి.ఆర్.&ఆర్.డి., కమిషనర్, పి.ఆర్.&ఆర్.డి., సి.ఈ.ఓ. సెర్ప్, స్పెషల్ కమిషనర్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు. కరీంనగర్ జిల్లా జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎల్.శ్రీలత, ముఖ్య కార్య నిర్వహణ అధికారిటి పవనకుమార్, రామడుగు ఎం.పి.డి.ఓ భాస్కర్ రావు, గన్నేరువరం ఎంపీడీఓ స్వాతి, మండల పంచాయతీ అధికారులు రాజశేఖర్ రెడ్డి, నర్సింహారెడ్డి, స్వచ్ఛ భారత్ జిల్లా కన్సల్టెంట్లు రమేష్, వేణు పాల్గొన్నారు.
Check Also
Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే
Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి …
HONOR 5G Phones” హానర్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. 16 వ తేది వరకే తగ్గింపు
HONOR 5G Phones” మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే హానర్ ఫోన్లను ఒకసారి పరిశీలించండి. అతి తక్కువ …