కెనడా, భారత్ రెండు దేశాల మధ్య చేలరేగిన చిచ్చు ఇంకా మండుతూనే ఉంది. ఇరుదేశాలు చర్య, ప్రతి చర్యలతో తగ్గేదేలే అన్న స్థాయిలో విమర్శలకు దిగుతున్నాయి. రాయభారాల తొలగింపు నుంచి ప్రస్తుతం వీసాల రద్దుదాకా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకీ ఈపరిస్థితి వచ్చింది.
ఈ చిచ్చు రేగడానికి కారణమైన నిజ్జర్ ఎవరు…
మొన్నటి జూన్ నెల 18తారీఖున కెనడా దేశంలోని బ్రిటీష్ కొలంబియాలో నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను సర్రేలోని గురుద్వారాలో కాల్చి చంపారు. అప్పటి నుంచి భారత, కెనడాల మధ్య చిచ్చు రేగింది. రెండు నెలలు సైలెంట్‌గా ఉన్న కెనడా నాలుగు రోజుల క్రితం ఆ దేశ ప్రధాన మంత్రి ట్రూడో భారత్‌పై విమర్శలు గుప్పించారు. మాదేశ పౌరుడిని మాదేశగడ్డ చంపారంటూ భారత్‌పై మండి పడ్డారు. అయితే 1990 సంవత్సరంలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఇండియా గవర్నమెంట్ ఉక్కుపాదంతో అణచివేసింది. ఈ నేపథ్యంలో 1997లో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన నిజ్జర్ కెనడాకు వెళ్లాడు. అక్కడ ఉపాధి కోసం ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఖలిస్తాన్ వేర్పాటు వాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని సిక్స్ ఫర్ జస్టిస్‌లో కూడా సభ్యుడిగా జాయిన్ అయ్యాడు. అదే సంస్థలో కొనసాగుతూ భారత్ వ్యతిరేక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడు. ఇతడిపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం 2020లో నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. 2007లో పంజాబ్‌లోని లూథియానాలో పేలుళ్లు, 2009లో పటియాలాలో రాస్టీయ్ర సిక్ సంగత్ అధ్యక్షుడు రూల్డా సింగ్ హత్యలో నిజ్జర్ హస్తమున్నట్టు అనుమానాలున్నాయి. కెనడా, యూకే, అమెరికాలో భారత రాయబార కార్యాలయాల దాడుల వెనుక నిజ్జర్ హస్తం ఉన్నట్టుగా భారత్ విచారణలో తేలింది.
‘విూ గమ్యం భారత్.. కెనడా వదిలి భారతదేశానికి వెళ్ళండి
మహిళా రిజర్వేషన్ బిల్లు.. 1996నుంచి ఇప్పటిదాక