దేశంలో టమాటాకు భారీ డిమాండ్ . దాదాపు 200 పైగా ధర పలుకుతోంది. రెండు నెలలుగా ఇదే తంతు కొనసాగుతోంది. అయితే దీన్ని అదనుగా చేసుకున్న కొందరు దుండగులు జార్ఖండ్ లోని గుమ్లా పట్టణంలోని తంగ్రా కూరగాయల మార్కెట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. మార్కెట్‌లో
వ్యాపారం చేసే 12 మంది వ్యాపారుల నుంచి సుమారు 40 కిలోల టమాటాలు, రూ. 10 వేల నగదును ఎత్తుకెళ్లారు. మరునాడు ఉదయం దుకాణాలను ఆ వ్యాపారులు తెరిచి చూడగా టమాటా బాక్సులు పగిలిపోయి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.