Saturday , 22 June 2024
Breaking News

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్

ఇటీవల ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో సక్సెస్ అందుకున్న ఇస్రో.. ఆదివారం మరో విజయం సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుండి ఆదివారం ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ద్వారా ఏడు ఉపగ్రహాలను విజ‌య‌వంతంగా భూ కక్షలోకి ప్రవేశ పెట్టినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. డీఎస్- సార్ ప్రధాన ఉపగ్రహంతో పాటు మరో ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో సైంటిస్ట్‌లు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శాస్రవేత్తలకు చైర్మన్ సోమనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇస్రోకు ఈ ఏడాది ఇది మూడవ వాణిజ్య ప్రయోగం కాగా.. ఈ పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ఏడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వాహననౌక ఉపగ్రహాలను కచ్చితమైన కక్షలోకి ప్రవేశపెట్టిందని వెల్లడించారు. పీఎస్‌ఎల్వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్వీ ప్రయోగం చేపట్టనున్నామని తెలిపారు….

About Dc Telugu

Check Also

Video viral

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Video viral” రీల్స్ చేయ‌డం… ఫేమ‌స్ అవ‌డం.. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌.. సాధార‌ణంగా కొన్ని ప‌నులు చేయ‌డానికి కొంత …

chai pepsi

chai pepsi” ఇదేంద‌య్యా స్వామి కూల్ డ్రింక్‌తో టీ… వీడియో వైర‌ల్

chai pepsi”  చాయ్ చ‌టుక్కునా తాగారా బాయ్ అనే పాట ఎంతో ఫేమ‌సో మ‌నందరికీ తెలుసు.. కొన్ని ప్రాంతాల్లో టీ …

Cyberabad Police"

Cyberabad Police” పిల్ల‌లు స్కూల్‌కి సుర‌క్షితంగా వెళ్లాంటే త‌ల్లిదండ్రులు ఇవి పాటించండి.. సైబరాబ‌ద్ పోలీసుల సూచ‌న‌లు

Cyberabad Police”  చిన్న‌పిల్ల‌లు స్కూల్‌కి వెళ్లే సంద‌ర్భంలో కొన్ని సార్లు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి.. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్ల‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగితే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com