Fireworks Explosion” మ‌రో భారీ పేలుడు: ఆరుగురు కార్మికులు మృతి, ఐదుగురికి గాయాలు

Fireworks Explosion” విరుదునగర్ (జూలై 1, 2025):  తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలోని సివకాసి సమీపంలోని ఓ ఫైర్‌వర్క్స్ తయారీ యూనిట్‌లో మంగళవారం ఉదయం భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ పేలుడు మంగ‌ళ‌వారం ఉదయం 8.45 గంటల సమయంలో జరిగింది. పటాకులు తయారీ సమయంలో రసాయనాలు కలిపే సమయంలో జరిగిన ఘర్షణ వల్ల పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

పేలుడు ప్రభావంతో యూనిట్‌లోని ఎనిమిది వర్కింగ్ షెడ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే అదుపులోకి తీసుకువచ్చారు. మృతదేహాలను ఘటనా స్థలంలో నుంచి వెలికి తీశారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద స్థలానికి విరుదునగర్ జిల్లా పోలీసు అధికారి డి. కన్నన్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

 

Tirupati”ఎవ‌రికీ క‌న‌ప‌డొద్ద‌ని కారులోఆ ప‌ని … ఊపిరాడ‌క ఇద్ద‌రు మృతి

Elon musk” కుబేరుడు కొత్త‌పార్టీ… ఆ బిల్లుపై ఘాటు విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *