రెండు మూడు వాహనాలు ఢీకొట్టడం చూశాం. కానీ ఇక్కడ ఏకంగా 150 వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో సోమవారం చోటు చేసుకుంది. 150 పైగా వాహనాలు ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. దీనికి కారణం పొగమంచే అని అక్కడి అధికారులు భావిస్తున్నారు. పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల ముందుగా ఏమున్నాయో తెలియకపోవడం వల్ల ఢీకొట్టుకున్నాయి. ఈ యాక్సిడెంట్ అంతా కేవలం అరగంట వ్యవధిలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదం లో ఏడుగురు మృతి చెందారు. 25 మందికి గాయలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ కారణంగా 11 మైళ్ళ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఇవి కూడా చదవండి
ముందున్నది మొసళ్ల పండగ అంటే ఇదేనేమో.. మొసలిని వదిలిన వైనంపై కెటిఆర్ ట్వీట్
పెగ్గు మీద పెగ్గులేసి… వేషాలు వేస్తే..ఎత్తిపడేసిన ఎద్దు..తగిన శాస్తి జరిగిదంటున్న నెటిజన్లు..