58 ఏండ్ల క్రితం పశువులను దొంగతనం చేసిన కేసులో ఇప్పుడు ఓ వ్యక్తిని బీదర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 1965 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా మెహకర్ గ్రామానికి చెందిన మురళీధర్ రావు కులకర్ణి అనే వ్యక్తికి రెండు గేదెలు, ఒక దూడ ఉండేవి. ఈ క్రమంలో ఒక రోజు అకస్మాత్తుగా వాటిని ఎవరో ఎత్తుకెళ్లారు. మురళీదర్‌రావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు రిజిష్టర్ చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ గ్రామానికి సమీపాన ఉన్నటువంటి మహారాష్ట్రలోని ఉదగిర్ ప్రాంతానికి చెందిన కిషన్ చందర్ (30 ఏండ్లు అప్పటి వయస్సు), వాఘ్మోర్ గణపతి (20 ఏండ్లు అప్పటి వయస్సు) లుగా పోలీసులు గుర్తించారు. వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారికి బెయిల్ వచ్చింది. బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తరువాత వారు కోర్టుకు హాజరుకాకపోవడంతో వారిద్దరిపై అరెస్ట్ వారెంట్ ఇషఉ్య అయింది. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకని తిరుగుతున్నారు.
ఏం కష్టమొచ్చిందో… కుటుంబమంతా ఆత్మహత్య
ఈ క్రమంలోనే కిషన్ చందర్ 2006లో మృతి చెందాడు. గణపతి మాత్రం పోలీసుల దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పాత కేసులపై దృష్టి సారించిన బీదర్ పోలీసులు ఈ కేసును మళ్లీ ఓపెన్ చేసి గణపతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని వయస్సు 78 ఏండ్లు. ఈ విషయమై బీదర్ ఎస్సీ చెన్నబసవన్న మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టి పెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో గణపతి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు.
డివైడర్ పైకి దూసుకెళ్లిన మినీ బస్సు : ఏడుగురు మహిళలు మ్రుతి
మా వార్తలు మీకు నచ్చినట్టు అయితే పక్కన ఉన్న గంట ను నొక్కి notification allow అనండి..