శనిగరం ఘోర రోడ్డు ప్రమాదం

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం శనిగరం స్టేజి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం గజ్వేల్‌కు చెందిన 11 మంది విద్యార్థులు కరీంనగర్లో ఎగ్జామ్‌కు హాజరెయ్యారు. పరీక్ష పూర్తయిన తరువాత గజ్వేల్‌ ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శనిగరం ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ వద్ద ఆగి ఉన్న ఉన్న లారీకి వీరి వాహనం ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఆరుగురికి గాయాలు కాగా సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *