ధర్మారం సర్పంచిని సన్మానించిన ఎస్సై శేఖర్ రెడ్డి..

నేటి కరీంనగర్- శంకరపట్నం
సర్పంచిగా బాధ్యతలు తీసుకున్న ధర్మారం సర్పంచ్ చింతిరెడ్డి పద్మను కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి సన్మానం చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ధర్మారం గ్రామ సర్పంచ్‌గా పద్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేశపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
9వ వార్డులో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు
వార్డు సభ్యురాలు సరోజన తిరుపతి…

నేటి కరీంనగర్ శంకరపట్నం:
వార్డు సభ్యురాలుగా గెలుపొందిన అన్నారపు సరోజన తిరుపతి మంగళవారం వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సరోజన తిరుపతి మాట్లాడారు. శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని 9 వ వార్డులో కాలనీ ప్రజల కు వెలుగును అందించేందుకు కాలనీలో రూ. 55 వేల ఖర్చుతో 45 ఎల్ఈడి లైట్లు వేయించినట్లు సరోజన తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ ఉపసర్పంచ్ ఆకు బత్తిని విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి దురుశెట్టి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎస్ ఐ శేఖర్ రెడ్డి ని సన్మానించిన కేశవపట్నం పాలకవర్గ సభ్యులు

నేటి కరీంనగర్: శంకరపట్నం:
ఎస్ ఐ కట్కూరి శేఖర్ రెడ్డిని కేశవపట్నం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వం కలిశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామం పంచాయతీకి డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందిన గోదారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ ఆకు బత్తిని విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానం చేసినట్టు విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ ఆకు బత్తిని విజయ్ కుమార్, పాలకవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.
కరీంనగర్ సిపి గౌస్ ఆలం ను మర్యాదపూర్వకలసిన ఐజె డబ్ల్యు సంఘం నాయకులు…

నేటి కరీంనగర్: శంకరపట్నం
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసినట్లు ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ బీఎం ఎస్ అనుబంధ సంఘం రాష్ట్ర నాయకులు తాండూరి కర్ణాకర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాకర్ మాట్లాడారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలయంలో సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శివ నాద్రి ప్రమోద్ కుమార్, జిల్లా అధ్యక్షులు జగన్నాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్, తెలంగాణ న్యూస్ ఇంగ్లీష్ దినపత్రిక ఎడిటర్ కోశాధికారి డిఎస్ ప్రసాద్, జమ్మికుంట, చిగురుమామిడి ,శంకరపట్నం మండలాలతో పాటు వివిధ మండలాలకు చెందిన జర్నలిస్టులు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
