రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఒకరికి గాయాలు..

నేటి కరీంనగర్: శంకరపట్నం:
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక్కరికి గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు 108 వాహన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కరీంపేట గ్రామానికి చెందిన మూల ఆంజనేయులు తన వ్యక్తిగత అవసరాల కోసం కరీంపేట నుండి కేశవపట్నం వస్తుండగా మార్గమధ్యంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఆంజనేయులు వాహనాన్ని ఢీకొట్టింది. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి 108 వాహన సిబ్బంది ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి పైలెట్ ఖా జా ఖలీల్ ఉల్లా చేరుకొని, ఆంజనేయులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

 


దుర్గం నగేష్ సామాజిక సేవ జర్నలిస్టులకు స్ఫూర్తి

దుర్గం నగేష్ దంపతులకు ఆత్మీయ సన్మానం

తెలంగాణ ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రాజశేఖర్

ఎన్టీపీసీ,  :
ఒక జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడడమే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన డా. దుర్గం నగేష్ నేటి జర్నలిస్టులకు ఆదర్శమని తెలంగాణ ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రాజశేఖర్ అన్నారు. సామాజిక స్పృహ కలిగిన వారంతా ఆయన సేవలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.

అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్‌ను ఇటీవల డా. దుర్గం నగేష్ అందుకున్న నేపథ్యంలో, ఆదివారం ఎన్టీపీసీలోని ఆయన నివాసంలో తెలంగాణ ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో డా. దుర్గం నగేష్, ఆయన సతీమణి దుర్గం ప్రమీలలకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా బందెల రాజశేఖర్ మాట్లాడుతూ… డా. దుర్గం నగేష్ ఒక దినపత్రికలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తూ ప్రజా సమస్యలపై వార్త కథనాలు రాసి పరిష్కారానికి కృషి చేశారన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లో పేదలకు సేవలందిస్తూ సామాజిక చైతన్యానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

డా. దుర్గం నగేష్ సతీమణి దుర్గం ప్రమీల ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ భర్తకు అండగా నిలిచి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఇటువంటి దంపతులను జర్నలిస్టులు స్ఫూర్తిగా తీసుకొని, సమాజంలో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు బందెల శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు ముడిమడుగుల మల్లన్న, సమతా సైనిక్ దళ్ నాయకులు శివకుమార్, లవన్ కుమార్, వెంకట నరసయ్య,నిఖిల్ సాయి, హరక్షిత తదితరులు పాల్గొన్నారు.

 

—————————————————————————————————-

*రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు ట్రినిటీ సి బి ఎస్ ఈ విద్యార్తి ఎంపిక అభినందించిన ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి
పెద్దపల్లి, :
శనివారం నంది మేడారం లో పెద్దపల్లి అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలోక్రాస్ కంట్రీ పోటీలు జరిగినాయి…అందులో..అండర్ 16 బాలుర విభాగంలో 2 కిలోమీటర్ల పరుకు పందంలో ఎ రాజు కుమార్ మొదటి స్థానం సాధించి ఈ నెల 2 వ తేదీన హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది … వీరిని ట్రినిట్ విద్యాసంస్థల చైర్మన్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ సబర్ ముఖర్జీ,వైస్ ప్రిన్సిపాల్ రాహుల్ పర్మర్, పిటీలు అజయ్ ,మౌనిక మరియు ఉపాధ్యాలు అభినందించారు.


 

బంగ్లాదేశ్ హిందువులపై దమనకాండ అమానవీయం
-దారుణహత్యకు నిరసనగా మతోన్మాదుల దిష్టిబొమ్మ దగ్ధం..
పెద్దపల్లి

బంగ్లాదేశులో ఇస్లాం మతం పేరుతో హిందువులపై జరుగుతున్న దమనకాండను ప్రపంచం యావత్తు ముక్తకంఠంతో ఖండించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ హిందూ యువకుడు దాస్ గుప్తాను ముస్లింలు అత్యంత కిరాతకంగా హతమార్చి, చెట్టుకు కట్టేసి దహనం చేయడాన్ని నిరసిస్తూ, ఇస్లాం మతోన్మాధుల దిష్టిబొమ్మను ఆదివారం కమాన్ చౌరస్తా వద్ద దగ్ధం చేసారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేష్ మాట్లాడుతూ, అన్ని ధర్మాలకు దేవుడు ఒక్కడేనని తన అభిప్రాయాన్ని ప్రకటించిన పాపానికి దాస్ గుప్తా తన ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలిపారు. పరమత సహనంపై ప్రగల్భాలు పలికే ఇస్లాం మతోన్మాదుల నిజస్వరూపానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులు తలుచుకుంటే ఇక్కడ అక్రమంగా నక్కిన బంగ్లాదేశ్ కుక్కలను పాతిపెడతామని హెచ్చరించారు. ఇక బంగ్లాదేష్ ఆగడాలను ఉపేక్షించేదిలేదని, తగిన గుణపాఠం చెప్తామన్నారు. బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఉంటామన్నారు. ఈ దేశంలో ఉంటూ శత్రు దేశాలకు వంతపాడే రాజకీయ నాయకులు తమపద్దతి మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజా సమక్షంలో శిక్ష తప్పదని రాకేష్ వారించారు. ఈ నిరసనలో సీనియర్ నాయకులు తంగెడ రాజేశ్వరరావు, కావేటి రాజగోపాల్, రాజమహంత కృష్ణ, ఎర్రోళ్ల శ్రీకాంత్, ఉప్పు కిరణ్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు గుడ్ల సతీష్, మామిడి ఉమేష్, పడాల శ్రీధర్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి కుమార్, పిట్ట వినయ్, కోశాధికారి గదాసి సతీష్, కార్యదర్శులు పోగుల రాజు, భూతగడ్డ రాజ్ కుమార్, ముంజ రాజేంద్రప్రసాద్, బొడ్డుపల్లి సంపత్, కుక్క వంశీ, మధుకర్, భగవత్, పూదరి హరీష్, కుక్క అంజి, జపతి శ్రీను, అరుణ్ షిండే, శివ, సాయి, సతీష్, వినోద్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

 

ఈరోజు బ్లాక్‌బస్టర్ డీల్స్

iQOO 15 ⚡
ప్రారంభ ధర ₹68,999 మాత్రమే!*
బ్యాంక్ ఆఫర్‌తో ఇంకా తగ్గింపు
https://amzn.to/4qdAbfh

boAt Epic Audio ⚡
70% వరకు తగ్గింపు
సూపర్ సౌండ్, సూపర్ ప్రైస్
https://amzn.to/3MKVNBt

⏰ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే!
ఇప్పుడే చెక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *