వినాయక మండపం వద్ద విషాదం చోటు చేసుకుంది. అన్నదానం చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లిన ఆరేండ్ల బాలుడికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా దత్తాయిపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదిత్య బాలుడు వినాయక మండపం వద్ద అన్నదానం చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, తల్లిదండ్రులు కన్నీటీ పర్యంతమయ్యారు.
Check Also
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
OnePlus ” వనప్లస్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివరాలు చూసుకున్నట్టయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …