పెండ్లంటే సరదాలు.. సంబురాలు.. చుట్టాల సందడి, నోరూరించే వంటలు.. అయితే భోజనాల విషయం పెండ్లి పిల్ల, పిలగాడి తరుపు బంధువుల మధ్య చిన్న చిన్నచిన్న కొట్లాటలు జరుగుతుంటాయి. చిన్నది కాస్త పెద్దదిగా మారి తలలు పగలగొట్టుకునేంటి వరకు వెళ్లిన ఘటన యూపీలో జరిగింది. పెండ్లి భోజనంలో రసగుల్లాలు పెట్టలేదని ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యూపీలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శంషాబాద్ పట్టణంలోని నయావాస్ లో గల బ్రిజ్బాన్ కు కుష్వాహా ఇంట్లో పెండ్లి వేడుక జరిగింది. గౌరీశంకర్ శర్మ మరో ముగ్గురితో అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో రసగుల్లాల విషయంలో గొడవ జరిగింది. అది చినికి చినికి కట్టెలతో కొట్టుకునే స్థాయి దాకా వెళ్లింది. ఓ మహిళతో పాటు మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.
ఇంత అహమా.. వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టిన ఆసీస్ క్రికెటర్లు.. 2007లోనూ ఇంతే
భారత్ భూ భాగంపై ఎగిరిన వింత వస్తువు.. ఫ్లయింగ్ సాసర్..?
నిన్నటి రోజు మనది కాదు… డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోడీ