బ్యాంకులో జరిగిన పొరపాటుకు బ్యాంకు సీఈవో రాజీనామా చేశారు. మొన్న ఆ మధ్యన ఓ కారు డ్రైవర్ ఖాతాలో 9 వేల కోట్లు జమఅయిన విషయం తెలిసిందే. తమిళనాడులోని మర్కంటైల్ బ్యాంకులో పనిచేసే ఉద్యోగి పొరపాటు వల్ల ఈ సొమ్ము జమైంది. ఈ క్రమంలో ఆ బ్యాంకు సీఈవో ఎస్ కృష్ణన్ ఆయన పదవికి రిజైన్ చేశారు. పర్సనల్ కారణాలవల్ల ఎండీ, సీఈవో పదవుల నుంచి తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. ఈయన రాజీనామాను మర్కంటైల్ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంకు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కృష్ణన్ ఎండీ, సీఈవో పదవుల్లో కొనసాగుతారు.
9 వేల కోట్ల పొరపాటు
తమిళనాడు స్టేట్‌లోని పళని నెరుక్కారపట్టికిలో రాజ్‌కుమార్ వ్యక్తి నివాసముంటున్నాడు. రాజ్‌కుమార్ చెన్నైలోని కొడంబాక్కంలో అద్దెకు కారు నడుపుతూ బతుకుతున్నాడు. సెప్టెంబర్ 9న పగటిల్లి 3 గంటలకు రాజ్‌కుమార్ ఫోన్ కు మేసేజ్ వచ్చింది. అప్పడు ఆయన దానిని తెరిచి చూడగా అందులో 9వేల కోట్ల రూపాయలు యాడ్ అయ్యినట్టు అందులోని సమాచారం. దీంతో షాక్ గురైన రాజ్‌కుమార్ అది కన్ఫామ్ చేసుకోవడానికి తన మిత్రుడికి 21 వేల రూపాయలు సెండ్ చేశాడు. సెండ్ కావడంతో తన ఆనందానికి ఆవధుల్లేకుండా పోయాయి. కానీ కొద్దిసేపటికే బ్యాంకు అధికారులు పొరపాటును గుర్తించారు. ఆరాజ్‌కుమార్ అకౌంట్ నుంచి డబ్బును తిరిగి తీసుకున్నారు.
ఇవికూడా చదవండి
అరబ్ దేశాలకు పాక్ బిచ్చగాళ్లు..
నన్ను క్షమిచండి కెనడా ప్రధాని ట్రూడో
బాలుడి కిడ్నాప్, హత్య కేసులో మరణ శిక్ష మహమూబాబాద్ కోర్టు కీలక తీర్పు