Mega DSC” ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఆదివారం (ఏప్రిల్ 20) న విడుదల చేశారు. ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు టెట్లో అర్హత సాధించిన వారు పోటీ పడొచ్చు. వయస్సు పరిమితిని 44 సంవత్సరాలకు పెంచారు. దీనిపై తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దరఖాస్తులు కూడా ఆదివారం (ఏప్రిల్ 20) పొద్దున్న 10 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. ఈ పక్రియను మొత్తం 45 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. మే నెల 15, 2025వ తారీకు వరకు ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించనుంది. ఫీజుల చెల్లింపులు కూడా మే 15 తేది వరకు అవకాశం ఉంటుంది.
వెబ్సైట్లో హాల్ టికెట్లను మే 30 నుంచి ఉంటాయని సమాచారం.
ఈ పోస్టులకు సంబంధించి ఎలా దరఖాస్తుల చేయాలో మంత్రి నారాలోకేష్ ఒక వీడియోను విడుదల చేశారు.
