20.04.2025 శంక‌ర‌ప‌ట్నం వార్త‌లు

తెలంగాణ అంబేద్కర్ యువ‌జ‌న సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొజ్జ….
మండల అధ్యక్షుడు సతీష్….
శంకరపట్నం డిసీ ప్రతినిధి


తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, బొజ్జ రవి శనివారం నియామకమయ్యారని, శంకరపట్నం మండల తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అంతడుపుల సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం గ్రామానికి చెందిన బొజ్జ రవి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘానికి కొన్ని ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్నాడని, ఆయన సేవలను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల కాంతం, రాష్ట్ర నాయకత్వం గుర్తించి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ లో నిర్వహించిన సమావేశంలో నియామకం చేసి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జలకాంతం నియామక పత్రాన్ని అందజేసినట్లు సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. తన నియామకానికి కృషిచేసిన తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు అంబేద్కర్ వాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు, శంకరపట్నం మండల ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి ఓదెలు, మెట్టుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు అంతడుపుల అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////////////////////////////
ధాన్యం అమ్మకాల్లో మోసాలకు గురికావొద్దు…
రైతులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి హితవు.. 


శంకరపట్నం బీసీ ప్రతినిధి
రైతులు ధాన్యం అమ్మకాల విషయంలో మోసాలకు గురి కావొద్దని, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండలంలోని గన్నేరువరం, మాదాపూర్, హనుమాజి పల్లి, జంగపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శ‌నివారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని నష్టపోవద్దన్నారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు.ఈ కార్యక్రమాల్లో గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, మాతంగి అనిల్, బొడ్డు సునీల్, జి.అంజి, పి.సంజీవ్, వెంకటి, శ్రీకాంత్ గౌడ్, పరిపూర్ణచారి, మార్గం మల్లేశం, ప్రదీప్. గుంటుక లింగయ్య, రాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////////////////////

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాన చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణ.. శంకరపట్నం డిసీ ప్రతినిధి 


రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, అందులో భాగంగానే ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. గన్నేరువరం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య పతేంద్ర భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచడమే కాకుండా అవసరమైన వసతులు కల్పిస్తున్నామన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. మానకొండూర్ నియోజకవర్గానికి 13వ విడతలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 48.80 లక్షల రూపాయలు మంజూరయ్యాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. శనివారం గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ .. గన్నేరువరం మండలానికి చెందిన 21 మందికి 5 లక్షల 93 వేల రూపాయలు మంజూరైనట్టు తెలిపారు. అలాగే బెజ్జంకి మండలంలోని 18 మంది లబ్ధిదారులకు రూ 5.56 లక్షలు, ఇల్లంతకుంట మండలానికి చెందిన 23 మందికి రూ.6.20 లక్షలు,తిమ్మాపూర్ మండలానికి చెందిన 48 మందికి రూ.12.42 లక్షలు, మానకొండూర్ మండలానికి చెందిన 47 మందికి రూ 12.33 లక్షలు, శంకరపట్నం మండలానికి చెందిన 24 మందికి రూ.6.36 లక్షలు మంజూరైనట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////

27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష…
ప్రిన్సిపల్ సరిత…
శంకరపట్నం డిసి ప్రతినిధి


ఈనెల 27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న‌ట్టు శంకరపట్నం మండల ఆదర్శ పాఠశాల, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బి సరిత ఓ ప్రకటనలో శనివారం తెలిపారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను మోడల్ స్కూల్ నందు చదవడం కోసం, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ మోడల్ స్కూల్ లో ప్రవేశ పరీక్ష నిర్వస్తామ‌ని పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీన ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12 :00 గంటల వరకు ఆరవ తరగతి విద్యార్థులకు, అలాగే 7వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2:00 నుండి 4:00 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ 21వ తేదీ నుండి telanganams.cgg.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొనవచ్చునని, దరఖాస్తు చేసుకున్న, విద్యార్థినీ, విద్యార్థుల, తల్లిదండ్రులకు పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ విద్యార్థులకు ఇచ్చే హాల్ టికెట్స్ లో పొందుపరచబడి ఉంటాయన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్న వివరాల కోసం మోడల్ స్కూల్ లో సంప్రదించి సందేహాలను నివృతం చేసుకోవాల‌ని సూచించారు. 27న సకాలంలో పరీక్షలకు హాజరై పరీక్షలు వ్రాసి ప్రతిభ కనబరిచి, ప్రవేశాలు పొందాలని ప్రిన్సిపల్ సరిత విద్యార్థులకు సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *