అంతరిక్షంలో పలు పరిశోధనల కోసం వెళ్లిన వ్యోమగాములకు ఆహారం అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీనిపై ఫ్రెంచ్ సైంటిస్టులు దృష్టి సారించారు. ఈ క్రమంలో మాంసాహార ఉత్పత్తులపై పలు రీసెర్చ్‌లు చేస్తున్నారు. డాక్టర్ సిరిల్లె ప్రిబిలా అనే పరిశోధకుడి నేతృత్వంలో లూనార్ హాచ్ ప్రాజెక్టులో భాగంగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. అంతరిక్షంలో ఆక్వాకల్చర్ సాగుపై పలు అధ్యయనాలు చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే అస్ట్రోనాట్స్ కు భూమిపై నుంచి ఆహారం పంపించే ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ పరిశోధనల్లో భాగంగా సీ బాస్ రకానికి చెందిన సముద్రపు చేపలు స్పేస్‌లో పెంచాలని సైంటిస్టులు నిర్ణయించారు. ఈ చేపలకు వెయిట్‌లెస్ ముఖ్యమైన లక్షణంగా ఉంటుంది. కాబట్టి వీటిని సైంటిస్టులు ఎంచుకున్నారు. రాకెట్ లాంచ్ సమయంలో ఉండే వైబ్రే షన్, హైపర్ గ్రావిటీ, మైక్రోగ్రావిటీ, కాస్మిస్ రేడియేషన్ తదితర పరిస్థితుల్లో సీ బాస్ చేపల గుడ్లు మనుగడ సాగిస్తాయా. లేదా..? అనే అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఈ చేపల గుడ్లు ఇప్ప టికే అనేక టెస్టుల్లో పాస్ అయినట్టు తెలుస్తున్నది. ఈ గుడ్లను అంతరిక్షంలోకి పంపించి, అక్కడ చేపలను పెంచి, వాటిని తొలుత భూమిపైకి పంపిస్తారు. వాటిపై అంతరిక్ష పరిస్థితుల ప్రభావం ఎంతమేరకు ఉందనే విషయమై విశ్లేషిస్తారు. అనంతరం ఈ ప్రయోగం విజ యవంతమైతే వ్యోమగాములకు వారానికి రెండుసార్లు చేపలను ఆహారంగా అందించాలని భావిస్తున్నారు.