UNESCO” భగవద్గీత మరియు భరత ముని రచించిన నాట్యశాస్థ్రాలకు యునెస్కో గుర్తింపు లభించింది. మెమరీ ఆఫ్ ది వల్డ్ రిజిస్టర్‌లో ఇవి చెక్కబడ్డాయి. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపును సూచిస్తుంది. ఈమేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
పవిత్ర హిందూ గ్రంథాలను మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో చేర్చాలనే యునెస్కోనిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇది అత్యుత్తమ విలువ కలిగిన డాక్యుమెంటరీ వారసత్వాన్ని పరిరక్షించే ప్రపంచ చొరవ అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం” అని ప్రధాని అభివర్ణించారు.
“యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ ది వల్డ్ రిజిస్టర్‌లో గీత, నాట్యశాస్త్రం చేర్చడం మన కాలాతీత జ్ఞానం మరియు గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు. గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను. చైతన్యాన్ని పెంపొందించాయని ఎక్స్‌లో ప్రధాని మోడీ రాసుకొచ్చారు.
ఈ మేరకు ప్రధానమంత్రి మోదీ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. ఈ ప్రకటనను మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా మొదట పంచుకున్నారు. యునెస్కో యొక్క ప్రతిష్టాత్మక మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో భారతదేశం ఇప్పుడు 14 ఎంట్రీలను కలిగి ఉందని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Karimnagar news” లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ గా తణుకు మహేష్
