Hindu EktaYatra” బీజేపీ జిల్లా ప్రతినిధి కళ్యాణ్ చంద్ర పిలుపు
శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన హిందూ ఏక్తా యాత్రను ఘనంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర పిలుపునిచ్చారు. శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో గోడపత్రికలు ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐక్యతా ప్రదర్శన
ప్రతి ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే హిందూ ఏక్తా యాత్రకు ప్రజల్లో విస్తృత ఆదరణ ఉందని, ఇది హిందువుల సంఘటిత శక్తిని చాటే విశిష్ట కార్యక్రమమని కళ్యాణ్ చంద్ర అన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న కరీంనగర్‌లో జరిగే యాత్రను కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. గత 13 ఏళ్లుగా సంజయ్ కుమార్ ఈ యాత్రను నిర్విరామంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.

ఘనంగా జరుగనున్న యాత్ర
ఈనెల 22న, హనుమాన్ జయంతి రోజున కరీంనగర్ వైశ్య భవన్ నుంచి యాత్ర ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగనుంది. రాజకీయాలకు అతీతంగా, హిందూ ధర్మంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ యాత్రలో పాల్గొనాలని కళ్యాణ్ చంద్ర పిలుపునిచ్చారు.

స్థానిక నాయకుల మద్దతు
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, నాయకులు దొంగల రాములు, జంగ జైపాల్, దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, కనుకం సాగర్, బిజిలి సారయ్య, నిమ్నశెట్టి సంపత్, పోతునూరి రాజు, బొజ్జ సాయిప్రాకాష్, వడ్లకొండ రాజేందర్, గూళ్ళ రాజు, అనిల్, దాసారపు తిరుపతి, పొద్దుటూరు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
