Local news” అనాధ వృద్ధాశ్రమంలో 53వ జన్మదిన వేడుకలు నిర్వహించిన జర్నలిస్ట్ డి.ఎస్. ప్రసాద్

Local news”  శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
తెలంగాణ న్యూస్‌ ఎడిటర్‌గా సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టు డి.ఎస్. ప్రసాద్ తన 53వ పుట్టినరోజు సందర్భంగా శనివారం వీరబ్రహ్మేంద్ర అనాధ వృద్ధాశ్రమంను సందర్శించి, అక్కడ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, వారికి అవసరమైన కొన్ని వితరణలు అందించారు. “ఇలాంటివారి ఆశీర్వాదాలే నిజమైన బహుమతి. వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది జీవితంలో చిరస్మరణీయమైన అనుభూతి,” అని డి.ఎస్. ప్రసాద్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీబీ ఫౌండేషన్ సి. పెళ్లి వీరమాధవ్, గాదె కరుణాకర్ రావు, సాయిల్లు, దీక్షితులు, గండి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

////////////////////////////////////////////

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *