Local News”బస్సులో విద్యార్థి మెడలో చైన్ మాయం – తనిఖీ చేసిన కేశవపట్నం పోలీసులు

Local News” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా – డిసి ప్రతినిధి

ఓ విద్యార్థిని ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మెడలో ఉన్న బంగారు గొలుసు మాయమైన ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం కరీంనగర్ జిల్లాలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

జమ్మికుంటకు చెందిన విద్యార్థిని, మెట్ పల్లి డిపోకు చెందిన బస్సులో క‌రీంన‌గ‌ర్ నుంచి హుజురాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలోని మానకొండూరుకు చేరుకున్న తర్వాత తన మెడలో ఉన్న చైన్ గమనించగా, అది కనిపించకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌కు విషయం తెలియజేశారు.

వెంటనే వారు బస్సును కేశవపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఆపి, సమాచారం ఇచ్చారు. పోలీసు ట్రైనింగ్ ఎస్సై సునీల్ రెడ్డి నేతృత్వంలో బస్సులో ఉన్న  ప్రయాణికుల‌ను తనిఖీ చేశారు. అయితే చైన్ మాత్రం లభించలేదు.

 “బంగారు గొలుసు గల్లంతైన విషయమై విద్యార్థిని కరీంనగర్ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కేశ‌ప‌ట్నం పోలీసులు సూచించారు.   

విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసుల సూచన మేరకు కరీంనగర్ పట్టణానికి వెళ్లినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *