Agriculture” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా – నేటి వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం చేయాలంటే రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ శాఖ అధికారులు, పరిశోధనా శాస్త్రవేత్తలు సూచించారు.
శంకరపట్నం మండలంలోని కన్నాపూర్, గద్దపాక, కాచాపూర్ గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడానికి “వికసిత్ కృషి సంకల్పం అభియాన్” శిక్షణ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి జి వెంకటేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు వరి సాగుపై అవగాహన కల్పించబడింది.
రైతులకు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ సునీత మాట్లాడుతూ, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, వాటి ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను తూచ తప్పకుండా పాటిస్తే, వాతావరణ మార్పుల దుష్పరిణామాల నుండి తమ పంటలను రక్షించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖ శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీకాంత్, ఏ. ప్రశాంతి, గృహ విజ్ఞాన శాస్త్రవేత్తలు, ఏఈఓ రాజకుమార్, ప్రజాప్రతినిధులు గోపు విజయకుమార్ రెడ్డి, గుర్రాల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శిక్షణ కార్యక్రమాల ద్వారా తమలోని సాంకేతిక అవగాహన పెంపొందించుకోవాలని వారు సూచించారు.
