Exmla Arepalli Mohan” నూతన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్


Exmla Arepalli Mohan”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రులుగా నియమితులైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు వాకిటి శ్రీహరి లను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ విప్ ఆరేపల్లి మోహన్ తెలిపారు.

గురువారం హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్‌లో నూతన మంత్రులను కలిసిన మోహన్ గారు వారికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం కొత్త మంత్రుల త్యాగస్వభావం, అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతారపు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *