Former Mla” బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్‌ ఆరేపల్లి మోహన్‌

Former Mla”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా – మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో మాజీ ప్రభుత్వ విప్‌ ఆరేపల్లి మోహన్ ఆదివారం ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

వెల్ది గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ లక్ష్మీ రామచంద్రం తల్లి ఇటీవల మృతి చెందిన నేపధ్యంలో, మోహన్ అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ – “బాధిత కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా సహాయం అందించే కృషి చేస్తాను,” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు తాజుద్దీన్ (మండల మైనారిటీ సెల్ నాయకుడు), జేరిపోతుల సతీష్ (సింగిల్ విండో డైరెక్టర్), నిరంజన్ చారి, జంపయ్య, రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *