Raitu shreyassu” రైతు శ్రేయస్సే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం – కాలానుగుణంగా పంట సాగు ముఖ్యమని శాఖ అధికారి భాగ్యలక్ష్మి సూచనలు

Raitu shreyassu”  శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మొలంగూర్, మెట్ పల్లి గ్రామాల్లో రైతు కేంద్రాల్లో వ్యవసాయ శాఖ మండలాధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి మాట్లాడారు.

భాగ్యలక్ష్మి సూచనలు:

  • రైతు శ్రేయస్సే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం.

  • కాలానుగుణంగా, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.

  • పంటలు సక్రమంగా సాగుచేస్తే ఖర్చులు తగ్గి, దిగుబడులు అధికమవుతాయని గుర్తు చేశారు.

  • వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం మే 29 నుండి జూన్ 12 వరకు 15 రోజుల పాటు నిర్వహించి, రైతులకు పంటలపై సాంకేతిక పరిజ్ఞానం అందించబడుతుందని వివరించారు.

  • వరి పంట సాగుపై మెలకువ పెంచుకొని, శాస్త్రవేత్తల సూచనలతో వ్యవసాయం చేయాలని సూచించారు.

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా ఎదగాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు:

భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు మహేష్, ఏడిఏ శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, ఏఈవోలు కీర్తన, తిరుపతి, మొలంగూర్, మెట్ పల్లి, కస్టర్ గ్రామాల రైతులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *