Raitu shreyassu” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మొలంగూర్, మెట్ పల్లి గ్రామాల్లో రైతు కేంద్రాల్లో వ్యవసాయ శాఖ మండలాధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి మాట్లాడారు.
భాగ్యలక్ష్మి సూచనలు:
-
రైతు శ్రేయస్సే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం.
-
కాలానుగుణంగా, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
-
పంటలు సక్రమంగా సాగుచేస్తే ఖర్చులు తగ్గి, దిగుబడులు అధికమవుతాయని గుర్తు చేశారు.
-
వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం మే 29 నుండి జూన్ 12 వరకు 15 రోజుల పాటు నిర్వహించి, రైతులకు పంటలపై సాంకేతిక పరిజ్ఞానం అందించబడుతుందని వివరించారు.
-
వరి పంట సాగుపై మెలకువ పెంచుకొని, శాస్త్రవేత్తల సూచనలతో వ్యవసాయం చేయాలని సూచించారు.
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా ఎదగాలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు:
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు మహేష్, ఏడిఏ శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, ఏఈవోలు కీర్తన, తిరుపతి, మొలంగూర్, మెట్ పల్లి, కస్టర్ గ్రామాల రైతులు.
