Mnkondur Mla” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన ఊటూరు, రంగపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు వివిధ శాఖల ద్వారా నిధులను సమకూరుస్తున్నాం. చేపట్టిన పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత కాలపట్టికలోనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాం” అని తెలిపారు.
️ ప్రారంభించిన అభివృద్ధి పనులు:
-
ఊటూరు గ్రామం:
-
జడ్పీ నిధులతో ₹25 లక్షల సైడ్ డ్రెయిన్
-
ఎన్ఆర్ఈజీఏ నిధులతో ₹75 లక్షల సీసీ రోడ్డు
-
ఎస్డీఎఫ్ నిధులతో ₹8 లక్షల ఎస్సీ కాలనీ సీసీ రోడ్డు
-
-
రంగపేట గ్రామం:
-
ఎన్ఆర్ఈజీఏ కింద ₹25 లక్షల సీసీ రోడ్డు
-
-
లక్ష్మీపూర్ గ్రామం:
-
₹1.5 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
-
