Aarogya Mahila” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
ప్రభుత్వం అమలు చేస్తున్న “ఆరోగ్య మహిళా వైద్య శిబిరాలు” మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని పల్లె దవాఖాన వైద్యాధికారి డాక్టర్ సురేష్ అన్నారు. శుక్రవారం మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని అర్కండ్ల, గద్దపాక గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన “డ్రై డే ఫ్రైడే గ్రామసభ” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
డాక్టర్ సురేష్ మాట్లాడుతూ:
“ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చు. పచ్చదనాన్ని, పరిశుభ్రతను సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగినవారిగా వ్యవహరించాలి” అన్నారు.
మహిళలు & చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి:
-
ఆరోగ్య మహిళా వైద్య శిబిరాలు: రోగ నిర్ధారణ, సలహాలు, వైద్యం
-
అంగన్వాడీ కేంద్రాల ద్వారా:
-
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం
-
చిన్నారులకు ఆరోగ్య భద్రత
-
-
అర్హులైనవారు అన్ని సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలన్న పిలుపు
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అరుణ, ప్రధానోపాధ్యాయురాలు పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
