Yoga day” 2025 యోగంతో మానసిక ప్రశాంతత – ఘనంగా ప్రపంచ యోగ దినోత్సవం

Yoga day” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా
ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సులభంగా పొందవచ్చని మండల వైద్యాధికారి డాక్టర్ గొట్టే శ్రవణ్ కుమార్ అన్నారు.

శనివారం ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు మోడల్ స్కూల్‌లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వైద్యాధికారి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, యోగ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందనీ, ఇది అన్ని వయస్సులవారికీ అవసరమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సరిత, ఆయుష్ డాక్టర్ సంధ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్, హెల్త్ సూపర్వైజర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *