Si keshavapatnam” ఎస్ఐ శేఖర్ రెడ్డి కి అంబేద్కర్ యువజన సంఘం ఘన సన్మానం

Si keshavapatnam”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన కట్కూరి శేఖర్ రెడ్డిని అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు అంతడుపుల సతీష్ నేతృత్వంలో నిర్వహించగా, ఆయన మాట్లాడుతూ శేఖర్ రెడ్డికి అంబేద్కర్ యువజన సంఘం తరఫున శాలువాతో సన్మానం చేసి సాదర స్వాగతం పలికినట్టు తెలిపారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో ప్రజలకు న్యాయం కలిగే విధంగా సేవలందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొజ్జ రవి, కాచాపూర్ మాజీ సర్పంచ్ కొండ్ర రాజయ్య, కల్వల మాజీ సర్పంచ్ దాసారపు భద్రయ్య, సీనియర్ నాయకులు కనకం శంకర్, క్యా దాసి భాస్కర్, ఓదెల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *