Molangur” శంకరపట్నం, కరీంనగర్ – తెలంగాణ రజక చైతన్య సంఘం జిల్లా అధ్యక్షుడు నాంపల్లి రాజేందర్ మంగళవారం ఒక బాధిత కుటుంబానికి పరామర్శ చేసి తన వంతుగా సహాయాన్ని అందించారు.
మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామానికి చెందిన తడిగొప్పుల సంపత్ అనే యువకుడు ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాజేందర్, బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని అందించారు.
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ, “ఇలాంటి విషాదకర సంఘటనలు మరెవరికీ జరగకూడదు. ఆ కుటుంబానికి నా వంతుగా బియ్యం పంపిణీ చేశాను. భవిష్యత్తులోనూ వారికి అండగా నిలుస్తాను” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ అభిమానిగా పేరుగాంచిన యూసుఫ్, నాయకులు గూళ్ళు ఐలయ్యతో పాటు బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
