Shankarpatnamnews” శంకరపట్నం, కరీంనగర్ – తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ దేశాల భూపాల్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ హడాక్ కమిటీ సభ్యులు మోరె ప్రభాకర్ మంగళవారం హైదరాబాదులో ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మోరె ప్రభాకర్ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా దేశాల భూపాల్ గారు నియమితులవడం గర్వకారణం. న్యాయ రంగంలో ఆయనకు ఉన్న అనుభవం రాష్ట్రానికి మేలు చేస్తుంది” అని తెలిపారు.
ప్రభాకర్, భూపాల్‌కు పూలగుచ్చం అందించి, శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ ప్రభాకర్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
