Friends donation”ఆపదలో అండ‌గా మిత్ర బంధం..

Friends donation” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా: స్నేహం అంటే కేవలం సంతోష సందర్భాలలోనే కాకుండా, ఆపదలోనూ అండగా నిలవడమే అని మరోసారి రుజువైంది. మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలానికి చెందిన ఆముదాలపల్లి గ్రామ యువకులు తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన విధానం గ్రామస్థులకు గర్వకారణంగా మారింది.

ఆ గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు నీరటి అరుణ్ అలియాస్ లక్కీ మాతృమూర్తి నీరటి ఎల్లక్క గారు ఇటీవల గుండెపోటుతో అనార్థవశాత్తూ మృతిచెందారు. ఈ విషాద సమయంలో, అరుణ్ స్నేహితులు మరియు గ్రామంలోని క్రికెట్ మిత్ర బృందం సభ్యులు కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అంతేకాదు, రూ. 25,100 మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ మానవీయత, మైత్రీ భావన స్నేహ బంధానికి నిజమైన అర్ధం చెప్పకనే చెప్పింది.

గ్రామ పెద్దలు ఈ యువకుల సేవా మనోభావాన్ని అభినందిస్తూ, ఇతరులకూ ఇది ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. “స్నేహం అనేది ఒకటే కాదు… అది సమయానికి అండగా నిలిచే అనుబంధం,” అని గ్రామస్థులు అన్నారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మిత్ర బృందానికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Pm Modi” ఘ‌నా జాతీయ అవార్డు మోడీ కి రావాడానికి కార‌ణ‌మిదే.. ఇంత‌కు ముందు ఎవరెవ‌రికి వ‌చ్చిందంటే

Student Visa”2025 విద్యార్థి వీసాలపై కొత్త ఆంక్షలు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *