Escaped lion” అడవికి రారాజు సింహం. మృగరాజు అనికూడా పిలుస్తారు. అటువంటి సింహం మన కంటపడతే పై ప్రాణాలు పైనే పోతాయి. అటువంటింది జనాలు గుంపుగా ఏకంగా నడిరోడ్డు మీదకొస్తే చదవుతుంటూనే వణుకు మొదలైందా.. ఈ ఘటన నిజంగానే చోటు చేసుకుంది.
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో గురువారం రాత్రి ఒక పెంపుడు సింహం తను ఉంటున్న గోడ దూకి పారిపోయింది. గోడ పక్కనే ఉన్న వీధిలోకి పరుగులు పెట్టింది. సింహాన్ని చూసిన అక్కడి ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
అదే రోడ్డుపై ఇద్దరు పిల్లలతో నడుచుకుంటు వెళ్తున్న ఓ మహిళపై వీధిలో వెంబడించి దాడి చేసింది. ఆతర్వాత పిల్లలపై కూడా దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను శుక్రవారం పోలీసులు విడుదల చేశారు.
వీడియోలో సింహం గోడ దాటి బైటకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. వస్తువులు మోస్తూ నడుస్తున్న మహిళపై దూకిన దృశ్యాలు కనిపించాయి. అది ఆమెను వెనుక నుంచి అడ్డంగా గుద్ది నేలపై పడేసింది.
ఆపై సింహం ఆమెతో ఉన్న ఐదేళ్ల, ఏడు సంవత్సరాల చిన్నారులవైపు తిరిగి, వారి ముఖాలు మరియు చేతులపై గోర్లు వేసినట్లు బాధితుల తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాడికి గురైన ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన జరిగిన వెంటనే సింహం యజమానులు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. వారు తమ పెంపుడు సింహం దాడి చేయడం చూసి ఆశ్చర్యపడి నవ్వుతూ నిలబడ్డారని బాధితుల తండ్రి తెలిపాడు.
పోలీసులు శుక్రవారం ప్రకటించిన ప్రకారం, ఈ ఘటన తర్వాత సింహాన్ని తీసుకుని పారిపోయిన ముగ్గురు వ్యక్తులను 12 గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు.
ఇది 11 నెలల వయస్సు కలిగిన మగ సింహంగా గుర్తించారు. పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని ఒక అడవి ప్రాణుల పార్కుకు తరలించారు. ఆ సింహం ఆరోగ్యంగా ఉన్నట్లు ఆ పార్క్ అధికారులు తెలిపారు.
పంజాబ్ రాష్ట్రంలో పెద్ద జంతువులను, ముఖ్యంగా సింహాలను పెంపుడు జంతువులుగా ఉంచడం ఓ ప్రతిష్టాత్మక విషయంగా భావించబడుతుంది.
2024 డిసెంబర్‌లో కూడా లాహోర్‌లో ఒక పెద్ద సింహం పారిపోయి జనాలను భయపెట్టి, చివరికి ఒక సెక్యూరిటీ గార్డు చేతిలో కాల్చబడింది.
ఆ దుర్ఘటన తర్వాత, పంజాబ్ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. వాటి ప్రకారం, పెద్ద జంతువులను పెంపుడు జంతువులుగా ఉంచాలంటే లైసెన్స్ అవసరం. వీటిని నివాస ప్రాంతాల్లో ఉంచడం నిషిద్ధం.
ప్రత్యేకంగా బ్రీడింగ్ కోసం ఉన్న ఫారాలకూ పెద్ద రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి మరియు అవి కనీసం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలి.
Lahore, Lion attack in Johar Town , woman and 2 children injured !#Lion #LionAttack #Lahore #WildLife #WWF #Lahore pic.twitter.com/cCNpA6wYRS
— Shehzad Qureshi (@ShehxadGulHasen) July 3, 2025
HimachalPradesh floods” 2025తుఫాను భీభత్సం: 69 మంది మృతి, 37 మంది గల్లంతు, రూ.700 కోట్లు నష్టం
Pm Modi” ఘనా జాతీయ అవార్డు మోడీ కి రావాడానికి కారణమిదే.. ఇంతకు ముందు ఎవరెవరికి వచ్చిందంటే
