Ramakrishna Vedic” హిందూ ధర్మాన్ని కాపాడండి – అది మిమ్మల్ని కాపాడుతుంది: శ్రీ రామకృష్ణ వైదిక పీఠం నిర్వాహకులు

Ramakrishna Vedic” శంకరపట్నం, డీసీ ప్రతినిధి:

శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం చైర్మన్ శీర్లవంచ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ, “ధర్మో రక్షతి రక్షితః – హిందూ ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది” అని హితబోధ చేశారు.

డిఎస్ ప్రసాద్‌కు ఘన సత్కారం

తెలంగాణ న్యూస్ ఇంగ్లీష్ దినపత్రిక సంపాదకులు డిఎస్ ప్రసాద్ పాఠశాలను సందర్శించిన సందర్భంగా, శ్రీ రామకృష్ణ వైదిక పీఠం తరఫున శాలువాతో ఘనంగా సత్కరించి ఆశీర్వచనాన్ని అందించారు.

చండీ హోమం – 13 రోజుల ప్రత్యేక యజ్ఞం

కామారెడ్డి లోని 13వ వార్డులో ప్రతి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా నిర్వహించే 13 రోజుల చండీ హోమం ఈ సంవత్సరం కూడా ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం మూడవ హోమం విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

చైర్మన్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు పీఠం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ న్యూస్ ఇంగ్లీష్ దినపత్రిక సంపాదకులు డిఎస్ ప్రసాద్ పాఠశాలను సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకొని వేద పీఠం ఆధ్వర్యంలో శాలువాలతో ఘన సత్కారం చేసి ఆశీర్వచనాన్ని అందజేసినట్లు చైర్మన్ కృష్ణమాచార్యులు తెలిపారు.

Oppo Reno14 5G” సరికొత్త డిజైన్‌తో శక్తివంతమైన ఫోన్ ఇప్పుడు మార్కెట్‌లో

Pm Modi” ఘ‌నా జాతీయ అవార్డు మోడీ కి రావాడానికి కార‌ణ‌మిదే.. ఇంత‌కు ముందు ఎవరెవ‌రికి వ‌చ్చిందంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *