Tjs Molangur” టీజేఏసీ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు దేశ్ ముక్ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు

 Tjs Molangur” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో శంకరపట్నం మండల టీజేఏసీ అధ్యక్షుడిగా సేవలందించిన శ్రీనివాసరావు దేశ్ ముక్, సోమవారం తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సమావేశం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో నిర్వహించిన తెలంగాణ జన సమితి జిల్లా ప్లీనరీ సందర్భంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కన్వీనర్ మోరె గణేష్ అధ్యక్షత వహించారు, ముఖ్య అతిథిగా కోదండరాం హాజరయ్యారు.


తెలంగాణ ఉద్యమ నేతల మధ్య సౌజన్య సమావేశం

శ్రీనివాసరావు దేశ్ ముక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కోదండరాం గారి నేతృత్వంలో తాను టీజేఏసీ శంకరపట్నం మండల అధ్యక్షునిగా భాగమై పనిచేసిన విషయాలను గుర్తు చేశారు. ఉద్యమంలో కోదండరాం నాయకత్వం అమూల్యమని, తనకు ఆయనతో మర్యాదపూర్వకంగా కలవడం గర్వకారణమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *