మొరదాబాద్ ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు అనుజ్ చౌదరి (34) గురువారం నాడు సాయంత్రం మొరదాబాద్ లోని తన అపార్ట్‌మెంట్ నుంచి మరో వ్యక్తితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు చౌదరిపై కాల్పులు జరిపారు. దీంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనలో చౌదరితో కలిసి నడుస్తున్న వ్యక్తి అక్కడి నుంచి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు బైక్ దిగి చౌదరిపై వరుసగా కాల్పులు జరిపి పారిపోయారు. రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతన్న అనుజ్ చౌదరిని స్థానికులు వెంటనే మొరదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు అమిత్ చౌదరి, అనికేత్‌లు అనుజ్ చౌదరి కుటుంబ సభ్యులే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Check Also
Spin Mop” స్పిన్ మాప్ టూఇన్ వన్.. 40 శాతం తగ్గింపుతో.. కేవలం రూ. 1089కే .. నాలుగు పీస్‌లు
ఇల్లు తుడించేందుకు ఉపయోగపడే స్పిన్ మాప్ పై అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ తగ్గుదల ప్రకటించింది. 40 శాతం తగ్గింపు …
Redmi LED Fire TV” 32 ఇంచుల టీవీ కేవలం కేవలం రూ. 11499 కే..
Redmi LED Fire TV” రెడ్ ఎంఐ నుంచి 32 ఇంచుల టీవీ కేవలం రూ. 11,499 కే స్మార్ట్ …
Wooden Table Desk” రూ. 2నుంచి 3 వేల లోపు మంచి స్టడీ, ల్యాప్‌టాప్ టేబుల్.. ఇప్పుడే ఆర్డర్ చేయండి
Wooden Table Desk” పిల్లల చదువు కోసం కానీ లేదా ల్యాప్టాప్ కోసం తక్కువ ధరలో మంచి టేబుల్ కోసం …