Nimisha Priya” న్యూఢిల్లీ, జూలై 9: యెమెన్‌లో హత్య (Yemen murder case) కేసులో దోషిగా తేలిన భారతీయ నర్సు నిమిషా ప్రియపై ఉరిశిక్ష జూలై 16న అమలు కానుంది. ఈ విషయం అధికారికంగా ధృవీకరించబడింది. కేరళకు చెందిన నిమిషా, యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మాహ్దీని హత్య చేసిన కేసులో 2018లో అక్కడి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది.
నిమిషా 2017 నుంచి యెమెన్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఆమె క్షమాభిక్ష కోసం అక్కడి అధ్యక్షుడు రషద్ అల్-అలిమిని అభ్యర్థించగా, (Yemeni President mercy rejection) అది తిరస్కరించబడింది. (Indian nurse death penalty) భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు ఈ అంశాన్ని బహుళమార్లు సమీక్షించామని, బాధితురాలి కుటుంబంతో క్రమం తప్పకుండా సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. అవసరమైన సాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు.
పరిణామాల నేపథ్యం:
నిమిషా ప్రియా 2008లో యెమెన్‌కు వెళ్లింది. అక్కడ కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత, ఆమె కోచిలో టావిూ థామస్ అనే ఆటో డ్రైవర్‌ను వివాహం చేసుకుంది. వివాహానంతరం తిరిగి యెమెన్‌కు వెళ్లి క్లినిక్ ప్రారంభించింది. (foreign prisoners in Yemen) యెమెన్ నిబంధనల ప్రకారం వ్యాపార భాగస్వామిగా తలాల్ మాహ్దీతో కలిసి పనిచేయాల్సి వచ్చింది.
అయితే వారి మధ్య వ్యాపార వివాదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆమెను బలవంతంగా ఆర్థికంగా దోచుకున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల అనంతరం మాహ్దీకి మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చినట్లు యెమెన్ పోలీసులు విచారణలో గుర్తించి, హత్యకు కారణమైందని తేల్చారు. దీనిపై ట్రయల్ కోర్టు, తర్వాత సుప్రీంకోర్టు కూడా నిమిషాను దోషిగా నిర్ధారించింది. (Indian nurse in Yemen jail)
ప్రస్తుతం, జూలై 16న ఉరిశిక్ష (death sentence July 16) అమలు జరగనున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Amazon Prime” అమెజాన్ ప్రైమ్ డే 2025 – మీ షాపింగ్ ఫెస్టివల్ వచ్చేసింది!
